- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వామ్మో.. వాహనంలో చూస్తే కళ్లు చెదిరిపోయే..!
దిశ, వెబ్ డెస్క్: మే 13న రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతోంది. ఈ మేరకు పోలీసులు, ఎన్నికల అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రలోభాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నగదు, బంగారం, గిఫ్ట్, ఎన్నికల ప్రచార సామాగ్రిపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన పత్రాలు లేని బంగారం, నగదు భారీ గుర్తిస్తున్నారు. అనంతరం సీజ్ చేసి అధికారులకు అప్పగిస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులు, ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు జాయింట్‌గా తనిఖీలు చేశారు. కంచికచర్ల మండలం పేరకలపాడు దగ్గర వాహనాల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బీవీసీ లాజిస్ట్రిక్స్ వాహనంలో భారీగా బంగారాన్ని గుర్తించారు. మొత్తం 66 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 14 కోట్లు ఉంటుందని తెలిపారు. సరైన ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేశారు. తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు.