- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: అజ్ఞాతంలో నెల్లూరు మేయర్ భర్త.. ఏ క్షణమైనా అరెస్ట్..!
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు మేయర్ స్రవంతి భర్త జయవర్దన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.దొరికితే ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. భార్య స్రవంతి అధికారాన్ని అడ్డుపెట్టుకుని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ సంతకాలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విజిలెన్స్ విచారణలో మేయర్ భర్త జయవర్దన్ తప్పు చేసినట్లు తేలింది. టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాత్ర కూడా ఉందని అధికారులు నిర్ధారించారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఫోర్జరీ సంతకం వ్యవహారంతో మేయర్ భర్త జయవర్దన్‌తో పాటు మరో ఏడుగురి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ సంతకాలు ఫోర్జరీ చేసి కోట్ల రూపాయలు ఆర్జించినట్లు పోలీసుల విచారణలో తేలింది. జవవర్దన్‌తో పాటు నలుగురు కార్పొరేషన్ సిబ్బంది, మరో ముగ్గరిపై కేసులు నమోదు చేశారు.
దీంతో మేయర్ స్రవంతి భర్త జయవర్దన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెన్నైలో ఉన్నట్లు సమాచారంతో పోలీసులు అక్కడి సైతం గాలించారు. కానీ అక్కడి నుంచి పారిపోయినట్లు గుర్తించారు. జయవర్దన్ ముఖ్య అనుచరుడు వంశీ కృష్ణ బెంగళూరులో అరెస్ట్ చేశారు. జయవర్దన్ కనిపిస్తే ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాలతో భర్తను కాపాడుకునేందుకు నెల్లూరు మేయర్ స్రవంతి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దలను కలిసి తన భర్తను కాపాడాలని కోరనున్నట్లు తెలుస్తోంది.