- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఎక్కడ..?
దిశ, వెబ్ డెస్క్: బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ (Bapatla Former Mp Nandigam Suresh) కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం(Mangalagiri Tdp Office)పై దాడి కేసులో ఆయనపై ప్రధానంగా అభియోగాలున్నాయి. దీంతో సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు సురేశ్ నివాసానికి వెళ్లారు. అయితే అక్కడ నందిగం సురేశ్ లేరు. అంతేకాదు రెండు రోజులుగా సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. దీంతో సురేశ్ కోసం గాలిస్తున్నారు. నందిగం సురేశ్ ఎప్పుడు కనిపించినా అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు నందింగం సురేశ్ హైకోర్టు (High Court)లో దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. తాము సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు 2 వారాల సమయం కావాలన్న అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ (Ycp) నేతలకు కూడా సురేశ్ టచ్‌లో లేరని తెలుస్తోంది. రెండు రోజులుగా సురేశ్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇవ్వకుండా సురేశ్ అజ్ఞాతంలో వెళ్లారని అంటున్నారు.