AP:బస్సు దగ్ధం కేసు.. ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలంటూ పిటిషన్

by Jakkula Mamatha |   ( Updated:2024-10-29 13:13:18.0  )
AP:బస్సు దగ్ధం కేసు.. ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలంటూ పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా (Guntur District) చిలుకలూరిపేట బస్సు దహనం కేసు ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. 1993 మార్చి 8 తెల్లవారుజామున చిలకలూరిపేట బస్సు దహనం సంఘటన భారత దేశాన్నంతా విషాదంలోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తం 23 మంది సజీవ దహనం అయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై తాజాగా చిలకలూరిపేట బస్సు దగ్ధం కేసులో ఇద్దరు నిందితులకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఖైదీల విడుదల సాధన సమితి ప్రభుత్వాన్ని కోరింది. 32 ఏళ్లుగా వారు జైల్లో మగ్గిపోతున్నారని హోంమంత్రి, న్యాయశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. 1993లో హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట వెళ్తున్న బస్సును చలపతి, విజయవర్ధన్ దోచుకోవడానికి ప్రయత్నించారు. ప్రయాణికులు ఎదురు తిరగడంతో పెట్రోల్ చల్లి నిప్పు పెట్టడంతో 23 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed