వాహనాలపై వాటిని ఉంచుకోవాలంటే అనుమతులు తప్పనిసరి..

by Indraja |
వాహనాలపై వాటిని ఉంచుకోవాలంటే అనుమతులు తప్పనిసరి..
X

దిశా ప్రతినిధి నంద్యాల సిటీ: ఎన్నికల కోడ్ నిబంధలు ఉల్లంఘనకు గురికాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కామేశ్వర్ రెడ్డి మండలంలోని వివిధ గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇకపై 4,3 ,రెండు చక్రాల వాహనదారులు తమ వాహనాలపై ఏ పార్టీ స్టిక్కర్ అయిన జెండా అయినా అంటించాలంటే ముందుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి(ఆర్ ఓ) అనుమతుల తీసుకోవాలి అని పేర్కొన్నారు.

అలనే గ్రామాల్లో ఉన్న ఇళ్లకు కూడా ఏ పార్టీకి సంబంధించిన స్టిక్కర్లు కానీ జెండాలు కానీ ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా అనుమతులు ఉండాలని తెలిపారు. ఎన్నిక ప్రవర్తన నియమావళి ఉల్లంఘించి జెండా కానీ స్టిక్కర్ కానీ అతికించినయెడల చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.గ్రామ విఆర్వోలు తలార్లు గ్రామాల్లోని ప్రజలకు ఈ విషయాన్ని చాటింపు లేదా మైకుల ద్వారా తెలియజేయాలని సూచించారు.

Advertisement

Next Story