- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..తిరుగుబాటు మెుదలైంది: టీడీపీ అధినేత చంద్రబాబు
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అని అన్నారు. నవశకం ప్రారంభమైందని యువగళం ప్రపంచానికి చాటింది అని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం అని చెప్పుకొచ్చారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీని టీడీపీ-జనసేన కూటమి పునర్‍నిర్మిస్తుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మరోవైపు విశాఖపట్నం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి గుణదల వెళ్లారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి మేరీమాత చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులకు చర్చి ఫాదర్‌లు ఆశీర్వనచనం అందజేశారు. అనంతరం మేరిమాత చిత్రపటాన్ని ఫాదర్లు అందజేశారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో 53 రోజులపాటు రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అనంతరం చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ రావడంతో ఇక షురూ అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం దేవాలయాల సందర్శనకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు. తిరుమల శ్రీవారి దర్శనం మెుదలుకొని సింహాచలం అప్పన్నస్వామి, శ్రీశైలం మల్లన్న స్వామితోపాటు పలువురు దేవుళ్లను దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన బెజవాడ కనకదుర్గమ్మను సైతం దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్న సంగతి తెలిసిందే.