- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
NDAలోనే ఉన్నా.. చెప్పే బయటకు వస్తా.. పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కల్యాణ్ ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెబుతారని ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏతో ఫ్రెండ్ షిప్‌పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్రలో భాగంగా గురుజలో ఇవాళ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తాను ఎన్డీఏ కూటమిలోనే ఉన్నానని.. ఎక్కడికి పోలేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి నుండి బయటకు వస్తే.. అందరికి చెప్పే వస్తానని.. దొంగచాటుగా రానని స్పష్టం చేశారు. నా తరుఫున మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.
అసలు మేం ఎన్డీఏ కూటమిలో ఉంటే మీకేంటి.. లేకపోతే మీకేంటని ప్రశ్నించారు. కాగా, ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన.. చంద్రబాబు అరెస్ట్‌తో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతామని సంచలన ప్రకటన చేశారు. ఎన్డీఏలో ఉంటూ టీడీపీ పొత్తు అంటూ జనసేనపై వైసీపీ నేతలు విమర్శల ఎటాక్ చేశారు. దీంతో ఎట్టకేలకు పవన్ కల్యాణ్ ఎన్డీఏతో ప్రయాణంపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు.