- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Deputy CM:నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నేడు(శనివారం) ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ నేటి నుంచి రెండురోజుల పాటు మహారాష్ట్రలో బహిరంగసభలు, రోడ్‌షోలలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో రెండు రోడ్ షోలు, ఐదు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అయితే మొదటి రోజు పర్యటనలో భాగంగా ఇవాళ(శనివారం) మరట్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2 గం.కు లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. రాత్రి 6గం.కు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు. రేపు(17వ తేదీ) విదర్భ ప్రాంతానికి వెళ్తారు. ఆదివారం ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షో లో పాల్గొంటారు. అనంతరం కస్బా పేట్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.