- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP Deputy CM:‘కర్తవ్యపథ్‌లో శకటం.. రాష్ట్రానికే గర్వకారణం’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో రిపబ్లిక్ డే(Republic Day) వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ(Vijayawada)లో నిర్వహించిన వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పాల్గొన్నారు. గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్యపథ్‌లో ఏపీ శకటం ఏటికొప్పాక లక్కబొమ్మల్ని ప్రతిబింబించడం రాష్ట్రానికి గర్వకారణమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏటికొప్పాక బొమ్మల ప్రాచుర్యం కోసం రాష్ట్ర అతిథులకు ఇచ్చే జ్ఞాపికల్లో వాటిని భాగం చేశామని తెలిపారు. గతంలో ఈ బొమ్మల కళాకారులిద్దరు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారని గుర్తు చేశారు. ఈ రోజు(జనవరి 26) ఏటికొప్పాక శకటం పరేడ్‌లో ప్రదర్శించడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.