ఆ నియోజకవర్గంపై పవన్ కల్యాణ్‌ ఫోకస్‌.. దూకుడు పెంచిన నేతలు

by Seetharam |   ( Updated:2023-11-01 12:53:58.0  )
ఆ నియోజకవర్గంపై పవన్ కల్యాణ్‌ ఫోకస్‌.. దూకుడు పెంచిన నేతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో టికెట్ ఆశించే ఆశావాహులు పార్టీ ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్య నేతలను కలిసి తమ మద్దతు కోరుతున్నారు. టికెట్ వస్తే తమకు సహకరించాలని కోరుతూ పర్యటనలు చేస్తున్నారు. మరికొందరు నియోజకవర్గంలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నేత, ఎన్ఆర్ఐ పెనుమాల జాన్ బాబు, పెనుమాల దేవిలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్య నేతలను కలిసి మద్దతు కోరడంతోపాటు జనసేన పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పవన్ కల్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరాలి అని ఆదేశించారు. ఇకపై తన ఫోకస్ పి.గన్నవరం నియోజకవర్గంపై ఉంటుందని సమీక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెనుమాల జాన్ బాబు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేసే విషయంలో అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి అందరి మన్నలను పొందుతున్నారు. మెుత్తానికి పి.గన్నవరం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేసేలా పార్టీ నేతలతో కలిసి ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జనసేన నాయకులు తోట శ్రీనువాసరావు, యన్నాబత్తుల నాగరాజు, అనుబాబు, కొండా చిన్ని, నారిన ఆది,టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు తోట రామకృష్ణ, తిరుమనాథం శ్రీకాంత్, దైవాల రాంబాబు,జనసేన వీరమహిళ అడ్డగళ్ల సిరిజ్యోతిలను పెనుమాల జాన్‌బాబు, పెనుమాల దేవిలు కలిశారు. వీరంతా జనసేన పార్టీ గెలుపుకోసం కృషి చేద్దామని తీర్మాణించారు.

Advertisement

Next Story

Most Viewed