- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
breaking: ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం..పవన్ కళ్యాణ్
దిశ వెబ్ డెస్క్: ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా భోగి పండుగ సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతం లోని మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికార ప్రభుత్వం అరాచక పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని.. రాష్ట్రంలో ఉపాధి లేక, నిరుద్యోగం పెరిగిపోయిందని.. రైతే రాజు అనే ఈ నేల పైన రైతులకు అన్యాయం జరుగుతుందని.. మరోసారి వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారమే అని ఆరోపించారు.
రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచబోతుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన టీడీపీ అధికారం లోకి వచ్చాక జై అమరావతి, జై ఆంధ్రా అనే నినాదంతో ముందుకు వెళ్లి.. అమరావతిని బంగారు రాజధానిగా నిర్మించుకుందామని పేర్కొన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అంటూ వచ్చి అదే వర్గాలను మోసం చేసిన పార్టీ వైసీపీ అని ఆయన మండిపడ్డారు.. తమ రాకను ఆపేందుకు ముళ్ల కంచెలు వేసిన వాటన్నిటిని దాటుకుని రాజధాని రైతుల వద్దకు వచ్చినట్లు పేర్కొన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు అన్ని త్వరలోనే తొలిగిపోతాయని..రాజధాని రైతులకు పట్టిన కీడు, పీడ తొలగిపోయే రోజులు దగ్గర ఉన్నాయి పేర్కొన్నారు. టీడీపీ – జనసేన కలిసింది రాజధాని రైతులు ఇబ్బందులను తీర్చడానికె అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.