Pawan kalyan: సీతారామ శాస్త్రి పాటల్లో అది చాలా ఇష్టం: పవన్ కల్యాణ్

by GSrikanth |   ( Updated:2022-10-17 11:15:48.0  )
Pawan kalyan: సీతారామ శాస్త్రి పాటల్లో అది చాలా ఇష్టం: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela Sitaramasastri) భౌతికంగా మన మధ్య లేకపోయినా తను ఈ సమాజానికి అందించిన అక్షర కిరణాల ద్వారా స్ఫూర్తిని పంచుతున్నాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) అన్నారు. ఆయన పంచ భూతాలతో కలిసిపోయినా రాబోయే తరానికి దిశానిర్ధేశం చేస్తూనే ఉంటారని వ్యాఖ్యానించారు. అలాంటి గొప్ప కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రీ అని, ఈ సందర్భంగా ఆయన్ను జనసేనాని గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. సీతారామ శాస్త్రీ రచనలన్నింటిలో కవిగా ఆయనలోని సామాజిక బాధ్యత కనిపిస్తుందని పేర్కొన్నారు. సమాజానికి బాధ్యతలు గుర్తు చేసే దృక్పథం అందులో నిక్షిప్తిమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆయన అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు.. ఆయన రచనల గాఢతను చెబుతూ కవిగా ఆయన్ని మరింత అర్ధం చేసుకునేలా చేసిన దర్శకుడు త్రివిక్రమ్‌(Trivikram)కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. అంతేగాక, సిరివెన్నెల సీతారామ శాస్త్రీ సమగ్ర సాహిత్యం అందిస్తున్న 'తానా' బృందానికి పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు చెప్పారు.

" నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది.

గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది.

ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా

తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే"

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'రుద్రవీణ' చిత్రంలోని 'చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా' పాటలోని ఈ పంక్తులు తననెంతో ప్రభావితం చేశాయని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed