పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు.. వైరల్ అవుతున్న వీడియో

by Rajesh |   ( Updated:2024-06-04 10:13:13.0  )
పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు.. వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. టీడీపీ 134, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్నారు. వైసీపీ కేవలం 12 సీట్లలో మాత్రమే మెజార్టీలో ఉంది. ఈ సందర్భంగా గతంలో పవన్ కల్యాణ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పవన్ మాట్లాడుతూ.. బలిచక్రవర్తి వామనున్ని చూసి ఇంతేనా అన్నాడని.. నెత్తి మీద కాలు పెట్టి అదపాతాళానికి తొక్కినప్పుడు తానేంటో తెలిసిందన్నారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా .. వామన అవతారాన్ని జనసేన చూపుతుందన్నారు. జగన్ గుర్తు పెట్టుకో అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు అన్నారు. తన పార్టీ పేరు జనసేనే కాదన్నారు. అయితే ప్రస్తుతం పవన్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Advertisement

Next Story