డిప్యూటీ సీఎం అవుతానని అనుకోలేదు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Rajesh |
డిప్యూటీ సీఎం అవుతానని అనుకోలేదు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం అవుతానని తాను అనుకోలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో జనసేన నాయకులతో నిర్వహంచిన కార్యక్రమంలో పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను పవన్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనం సాధించిన గెలుపు ఎంతో గొప్పదన్నారు. కూటమి విజయానికి మనం తీసుకున్న నిర్ణయమే కీలకం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛ ఉండేది కాదన్నారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచామని గుర్తు చేశారు. దేశంలో మన గెలుపు ఓ కేస్ స్టడీగా మారిందన్నారు. భారీ విజయంతో జనసేన బాధ్యత మరింత పెరిగిందన్నారు.

ప్రధాని మోడీ మనసులో నాకు స్థానం ఉందని.. అందుకే వెంటనే ప్రధాని మోడీని కలవలేదన్నారు. ఎంత సాధించినా.. తగ్గి ఉండటం మంచి అలవాటు అని పవన్ తెలిపారు. గతంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదన్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాలంటే భయం.. ఇంట్లో వాళ్లపై కూడా దుర్భాషలాడిని పరిస్థితిని చూశామని.. ఎంపీని బంధించి కొట్టించిన తీరును చూశామని వైసీపీ సర్కారుపై పరోక్షంగా ఫైర్ అయ్యారు. సుదీర్ఘ అనుభవం, సీఎంగా పనిచేసిన చంద్రబాబును కూడా జైలులో పెట్టారని పేర్కొన్నారు. అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూకుంభకోణాలు చూశామన్నారు.

ఐదుకోట్ల మంది ఒక్కటై అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారన్నారు. పోటీ చేసిన చోటే కాదు.. చేయని చోట్లా వీర మహిళలు జనసైనికులు తీవ్రంగా పోరాడారని పవన్ కొనియాడారు. బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటా అని భరోసా ఇచ్చారు. జనసైనికులు, వీర మహిళలు తన వైపు బలంగా నిలబడ్డారని పవన్ గుర్తు చేశారు. ఎలాంటి పదవి ఆశించకుండా జనసైనికులు పోరాడారు. ఊహించని మెజార్టీతో గెలవడం గొప్ప విషయం అన్నారు. వైసీపీ సహా ఏ పార్టీ తమకు శత్రువులు కాదన్నారు. చేతగాకకాదు.. కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచిది కాదన్నారు. పదవులు కూడా పక్కనబెట్టి పోరాడే పార్టీ జనసేన అని పవన్ అన్నారు. అయితే వారాహి దీక్ష ముగియడంతో పవన్ తిరిగి తన పాత లుక్‌లో కనిపించారు. పార్టీ ప్రజాప్రతినిధులకు బొకేల స్థానంలో కూరగాయల బుట్టను పవన్ అందజేశారు.



Next Story