వరద బాధితులను పరామర్శించలేదని వైసీపీ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పవన్ కల్యాణ్

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-04 14:46:53.0  )
వరద బాధితులను పరామర్శించలేదని వైసీపీ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: వరద సహాయక చర్యల్లో తాను పాల్గొనకపోవడంపై విమర్శిస్తున్న వైసీపీ(YCP) నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం రివ్యూ మీటింగ్‌ అనంతరం ఆయన మాట్లాడుతూ.. విమర్శించే నోళ్లు తనతో వస్తే సహాయక చర్యలు ఎలా ఉన్నాయో చూపిస్తానని అన్నారు. తాను బాధితుల వద్దకు వెళితే నా మీద అభిమానులు పడి గందరగోళ పరిస్థితి ఉంటుంది. అధికారుల పనికి తీవ్ర ఆటంకం కలుగుతుంది. దాంతో పాటు అధికారులు, పోలీసుల(Police)పై ఒత్తిడి కూడా పెరిగింది.

ఒకసారి వైసీపీ నేతలు తనతో బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుందని అన్నారు. ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. వీలైతే ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసి ఆదుకోవాలని హితవు పలికారు. మరోవైపు ఇవాళ వరద బాధితుల సహాయార్థం పవన్ కల్యాణ్ మరో ఐదు కోట్ల విరాళం ప్రకటించారు. ఇప్పటికే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌(CM Relief Fund)కు కోటి ప్రకటించిన ఆయన.. ఇవాళ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు ప్రకటించారు. అనంతరం ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు ఇవ్వనున్నారు. ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళం ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed