రూ.5 కోట్లు అప్పు చేసిన Pawan Kalyan

by srinivas |   ( Updated:2022-12-09 12:17:16.0  )
రూ.5 కోట్లు అప్పు చేసిన Pawan Kalyan
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.5 కోట్లు అప్పు చేశారని ఆయన రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ తెలిపారు. పవన్ కల్యాణ్ తాను కష్టపడి సంపాదించిన సొమ్మును ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారని..రైతాంగానికి అండగా నిలబడుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ అవినీతి ఎంత ఉందో ప్రజలకు తెలుసునన్నారు. లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యమన్నారు.


పవన్ కల్యాణ్ తన సంపాదనను అందరికీ పంచిపెడుతున్నారని స్పష్టం చేశారు. చివరికి పవన్ కల్యాణ్ ట్యాక్స్ కట్టేందుకు తన కళ్లెదుటే రూ.5 కోట్లు అప్పు చేశారని తెలిపారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం దిశ, దశ మారుతుందన్నారు. మన సంపదకు, ఆస్తులకు, ప్రభుత్వ సంపద, ఆస్తులకు రక్షణగా ఉండే ముఖ్యమంత్రిగా పవన్ నిలుస్తారని పి హరిప్రసాద్ తెలిపారు.

Also Read....

Supreme Courtలో జగన్ ఆస్తుల కేసు.. నిందితుడికి చుక్కెదురు

Advertisement

Next Story