- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ నా కుటుంబాన్ని రోడ్డుకు లాగాడు..ముద్రగడ సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు వారం రోజులే ఉండటంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా రోడ్‌షో లతో ప్రచారం ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై మాటాలు తూటాల్లా పేలుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇటీవల ముద్రగడ కూతురు క్రాంతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో ముద్రగడ స్పందిస్తూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని రోడ్డుకు లాగాడని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. నేను చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి ఏ రోజు మాట్లాడలేదు. నా కుటుంబంలో పవన్ చిచ్చు పెట్టాడు. నా కుమారైను అందరికీ పరిచయం చేశాడు. మీ కుటుంబంలో డ్రగ్స్‌తో పట్టుబడిన అమ్మాయిని, ప్రేమించి పెళ్లి చేసుకన్న అమ్మాయిని, మీరు వదిలేసిన ఇద్దరు భార్యల్ని ఎందుకు పరిచయం చేయట్లేదు అని ప్రశ్నించారు. నాపై ప్రేమ నటించద్దు అని పేర్కొన్నారు.