- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో సమ్మె చెయ్యని కార్మిక వర్గం లేదు.. పట్టాభిరామ్
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు సమ్మెలతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. ఆంద్రప్రదేశ్ లో సమ్మె చేయని కార్మిక వర్గం లేదని ఆరోపించారు. అంగన్ వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, 108-104 అంబులెన్సుల ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరు జగన్ పరిపాలనతో విసిగివేసారి చివరికి సమ్మెలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులు అడిగిన డిమాండ్ల తీర్చడానికి ప్రభుత్వం దగ్గర నిధులుండవని.. కానీ.. జగన్ రెడ్డి తన విలాసాల కోసం తగలెయ్యడానికి ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ తాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే ప్రజలు ఆ హామీల అమలు కోసం పోరాడుతున్నారని.. అలాంటి వారిపై లాఠీలు ఝళిపించి, ఎస్మా చట్టాలు ప్రయోగిస్తారా? అని పట్టాభిరామ్ ప్రశ్నించారు.
జగన్ రెడ్డి తన విలాసాల కోసం నిర్మించుకున్న రుషికొండ ప్యాలెస్ విలువ కూడా చేయదు, అంగన్ వాడీ సిబ్బందికి తాను ఇచ్చిన హామీ ఖరీదు అని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ తాను ఇచ్చిన హామీ ని గుర్తుచేసుకోవాలి అన్నారు. అంగన్ వాడీ సిబ్బందికి తెలంగాణలో కంటే రూ.1000 అదనంగా జీతం చెల్లిస్తానని హామీ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు? ప్రస్తుతం తెలంగాణలో అంగన్ వాడీ సిబ్బందికి ప్రతినెలా రూ.13,600 ఇస్తున్నారని.. కనుక జగన్ తాను ఇచ్చిన మాట ప్రకారం జగన్ రెడ్డి రూ.14,600లు ఇవ్వాలి.. కానీ ఇస్తున్నది రూ.11,500లు మాత్రమేనని పేర్కొన్నారు.
ఇక ప్రజలు ఓట్లేసి మిమల్ని గెలిపించింది అరబిందో సంస్థకు సేవ చేయడానికా.. ? అని ప్రశ్నించిన ఆయన.. వేలకోట్ల విలువైన రామాయపట్నం పోర్టు, సోలార్ పవర్ పార్కులు అరబిందో సంస్థకు ఎలా దోచిపెడతావు జగన్ రెడ్డి అని నిలదీశారు?. 60 శాతం నిధులు కేంద్రమే భరిస్తుందని.. కేవలం రాష్ట్ర వాటాగా 40 శాతం నిధులు చెల్లించాలని.. అది కూడా చెల్లించకుండా జగన్ రెడ్డి సర్వశిక్షా అభియాన్ సిబ్బంది జీతాలు మింగేశాడని పట్టాభిరామ్ మండిపడ్డారు.