పార్వతీపురం మన్యం డిఈవో సస్పెండ్

by Anjali |
పార్వతీపురం మన్యం డిఈవో సస్పెండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్వతీపురం మన్యం జిల్లా వీరగొట్టాం మండలం రేగులపాడు కేజిబీవీ పాఠశాలలోని నలుగురు విద్యాధికారులు సస్పెండ్‌కు గురయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు శుక్రవారం ప్రకటించారు. వీరఘట్టం మండలం రేగులపాడు గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని గురువారం రాత్రి విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ సందర్శించారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

అయితే పాఠశాల వేసవి సెలవులకు ముందుగానే ఎనిమిదో తరగతి విద్యార్థుల టెక్ట్స్‌ పుస్తకాలను అందజేసినప్పటికీ వాటిని ఇప్పటివరకు విద్యార్థులకు పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నాడు-నేడు పనులపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌ డి వి.రమణ, ఎంఈఓ పి.కృష్ణమూర్తి, జిసిడివో రోజా రమణి, కస్తూర్భా గాంధీ విద్యాలయ స్పెషల్‌ ఆఫీసర్‌ రోహిణిలను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed