- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Palnadu: తండాలో పులి.... బంధించండి బాబో..!
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా హనుమాపురంతండాను పులి వణికిస్తోంది. రెండు, మూడో రోజులుగా జనవాసాల్లో సంచరిస్తూ స్థానికులను హడలెత్తిస్తోంది. రాత్రి సమయంలో మేకల మందలపై దాడులు చేస్తోంది. పులి దాడిలో మేక మృతి చెందింది. పులి పగలు అటవీ ప్రాంతంలో ఉంటూ రాత్రి సమయంలో హనుమాపురం తండా వైపు వెళ్తోంది. కనిపించిన జంతువులపై దాడి చేస్తోంది. గురువారం రాత్రి మేకలమందపై దాడి చేయడాన్ని స్థానికులు గమనించి గట్టి కేకలు వేశారు. దీంతో పులి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది.
పులి సంచారంపై అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందజేశారు. ఈ మేరకు పులిని పట్టుకునేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా తిరగొద్దని సూచించారు. అయితే హనుమాపురం తండా వాసులు మాత్రం భయాందోళకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి కాలు బయట పెట్టేందుకు జంకిపోతున్నారు. పులి ఎప్పుడు ఏం చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. త్వరగా పులిని బంధించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పులి మళ్లీ రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.