- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: టీడీపీ కార్యకర్తలతో పాలకుర్తి భేటీ.. సమావేశ సారాంశం ఇదే..
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో గెలుపే ద్యేయంగా ప్రతి పార్టీ ఆచి తూచి అడుగెలుస్తోంది.ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల నేతలు, అధినేతలు ప్రచారంలో బిజీగా మారిపోయారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా భహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం అందరికి సుపరిచితమే. కాగా ఈ నెల 25వ తేదీన "రా కదిలిరా భహిరంగ సభను" పత్తికొండలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలతో మంత్రాలయం నియోజకవర్గ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశం లో మాట్లాడిన ఆయన పత్తికొండలో ఈ నెల 25వ తేదీన జరగనున్న "రా కదలిరా భహిరంగ సభను" విజయవంతం చెయ్యాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలానే అధికారంలో కి వచ్చేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారని.. తీరా అధికారం లోకి వచ్చిన తరువాత ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయక ఆ వాగ్దానాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన అరాచకాలను ప్రజలకు తెలిసేలా చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం చేపట్టారని తిక్కారెడ్డి పేర్కొన్నారు.