- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులివ్వండి: ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు
దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. చంద్రబాబు నాయడు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ల విచారణకు ఏపీ హైకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది కోరారు. చంద్రబాబును అరెస్ట్ చేయకుండా..మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టును కోరారు. మరికాసేపట్లో ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేసింది ఏపీ హైకోర్టు. అమరావతి ఇన్నర్ రింగ్ రెడ్, స్కిల్ డవలప్మెంట్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్ స్కాం వంటి పలు కేసులలో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు ఈనెల 9న తీర్పు వెల్లడించింది. అన్ని పిటిషన్లను కొట్టేసింది. దీంతో ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేయగా దాన్ని తిరస్కరించింది. దీంతో బుధవారం చంద్రబాబు తరపు న్యాయవాదులు మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఐఆర్ఆర్, అంగళ్లు కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.