- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Andhra Pradesh:ఏపీలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు
దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని శాఖల్లో ప్రక్షాళన మొదలుపెట్టింది. అంతేకాదు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. చంద్రబాబు సర్కార్ రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వివిధ స్థాయిల్లో కొనసాగుతున్న ఐఏఎస్‌లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 11 మంది ఐఏఎస్ అధికారులతో పాటు ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన అధికారుల వివరాలు..
రాష్ట్రంలో బదిలీ అయిన అధికారుల వివరాల్లోకి వెళితే..ప్రణాళిక సంఘం జాయింట్ సెక్రటరీగా అనంత్ శంకర్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా పీఎస్ గిరీషా, కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా నవ్య, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఎస్. భార్గవి, ఫైబర్‌నెట్ ఎండీగా కొత్తమాసు దినేశ్‌కుమార్, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా దినేశ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య, అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా డి.హరిత, తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్‌గా ఎస్.చిన్నరాముడు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పి.శ్రీనివాసులు, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా తాటిమాకుల రాహుల్‌కుమార్ రెడ్డి, విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సేదు మాధవన్, నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా కొల్లాబత్తుల కార్తీక్ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.