- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ ఒక్కరోజు సేవలు రద్దు చేసిన టీటీడీ
దిశ,వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. నవంబరు 19 న ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఈ రోజున అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీతీర్థం సందర్భంగా తిరుమల నుండి సారె తీసుకెళ్లాల్సి ఉన్నందున ఉదయం సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు. నవంబరు 19న పుష్పయాగం రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.