‘కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదు’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదు’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల కారణంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాలు(Heavy Rains), వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇంకా బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వరద బాధితుల తక్షణ సహాయక చర్యల(Relief measures) కింద తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్లు ప్రకటించింది. అయితే, దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్పందించారు. కేంద్రం వరద సాయం ప్రకటించినట్లు వస్తున్న వార్తలు ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు. సాయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వరద(Floods) నష్టం పై ప్రాథమిక అంచనా రిపోర్టు రూపొందించి రేపు ఉదయం కేంద్రానికి పంపిస్తామని సీఎం స్పష్టం చేశారు. బాధితులకు సాయం విషయంలో కేంద్రంతో పాటు బ్యాంకర్లతో మాట్లాడుతున్నామన్నారు. బీమా కట్టిన వారందర్నీ త్వరగా ఆదుకోవాలని కోరుతున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed