దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఏపీ రెండవస్థానంలో ఉంది.. టీడీపీ ఎమ్మెల్యే

by Indraja |
దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఏపీ రెండవస్థానంలో ఉంది.. టీడీపీ ఎమ్మెల్యే
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు మూడో రోజు కూడా కొనసాగాయి. ఇక ఈ రోజు సమావేశాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటుగా మరికొంతమంది సభ్యులు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, అలానే వ్యవసాయ పంటల గిట్టుబాటు ధరల గురించి చర్చించాల్సిందిగా వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఆ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు సంక్షోమంలో ఉన్న వ్యవసాయ రంగం గురించి అలానే నిర్వీర్యమైనటువంటి ఇర్రిగేషన్ ప్రోజెక్టులకు సంబంధించి వాయిదా తీర్మానాన్ని అసెంబ్లీ లో చర్చకి ఇచ్చామని తెలిపారు. అయితే ఆ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. వ్యవసాయం గురించి, అలానే రైతుల గురించి చర్చించడానికి కూడా ఈ ప్రభుత్వం ఇష్టపడడం లేదని పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డి పాలన రైతుల వ్యతిరేకంగా ఉందని స్పష్టగా తెలుస్తోందని వెల్లడించారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంల్లో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయాని తెలిపారు. నేడు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 3 వ స్థానంలో ఉందని.. ఇక కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 2 వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇక అప్పులున్న రైతు కుటుంబాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని.. ఇందుకు కారణం వైసీపీ రైతు వ్యతిరేక పాలనని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Advertisement

Next Story

Most Viewed