- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసారి పవన్ కల్యాణ్ పోటీ చేసేది అక్కడి నుంచేనా..?
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? ఒక చోట చేస్తారా?, లేదా గతం మాదిరిగా రెండు చోట్ల బరిలోకి దిగుతారా అనే ప్రశ్నలు రాష్ట్ర జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానుల్లో మెదులుతున్నాయి. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసినా పవన్ కల్యాణ్‌ను ఈసారి కచ్చితంగా గెలిపించుకుంటామని ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు చెబుతున్నారు. అయితే కాకినాడ జిల్లా జనసేన పార్టీ నేతలు మాత్రం తమ వద్దనే పోటీ చేయాలని పవన్ కల్యాణ్‌ను కోరుతున్నారట. కాకినాడలో జనసేన కేడర్ భారీగా ఉందని, బలం కూడా ఉందని, ఈ సారి ఎన్నికల్లో కచ్చితంగా గెలిపించుకుంటామని ఇటీవల జరిగిన సమావేశాల్లో పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారట. అటు సామాజిక వర్గంగా కూడా పవన్ కల్యాణ్‌కు ఇక్కడ కలిసొచ్చే అంశంగా చెబుతున్నారట. పొత్తులో భాగంగా కాకినాడ అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌ను కూడా పట్టుబట్టాలని సూచించారట. కాకినాడ 48 డివిజన్ల వారీగా నిర్వహించిన సమావేశాల్లో జనసేన కేడర్ కూడా ఇదే విషయం పవన్ కల్యాణ్‌కు చెప్పిందట. అటు పవన్ కల్యాణ్ కూడా ఈ ప్రతిపాదనకు సంతృప్తి వ్యక్తం చేశారట. ఇక జనసేన పార్టీ కార్యకర్తల కోరిక మేరకు పవన్ కల్యాణ్ కాకినాడ అసెంబ్లీకి పోటీ చేస్తారా..? లేదా వేరే చోట నుంచి బరిలోకి దిగుతారా అనేది చూడాలి.