- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోడి కోడిపందాలు అడ్డుకోవాలి.. ఆదేశాలు జారీ చేసిన హై కోర్టు
దిశ వెబ్ డెస్క్:సంక్రాంతి అంటేనే ముగ్గుల ముంగిళ్ళు, పిండి వంటలే కాదు కోడిపందాలు కూడా. కోడి పందాలు లేకుండా సంక్రాంతి పూర్తికాదు అంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోడి కోడిపందాల ప్రేమికులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కోడి పందాలు లేకుండా సంక్రాంతి ముగియదు. ఇక అక్కడ సంక్రాంతి వస్తే పందెం కోళ్ల విలువ లక్షల్లో పలుకుతుంది. ఆ ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు హై కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఖాతరు చెయ్యరు. ప్రత్యేక అనుమతులు తీసుకొని మరి కోడి పందాలు నిర్వహిస్తారు. కోడి పందాల నిర్వాహణ కోసం ఏకంగా బరులు ఏర్పాటు చేస్తారు. అనంతరం చుట్టూ వందలమంది చూస్తుండగా పుంజులు పందెంలోకి దిగుతాయి. రక్తం కారుతున్న ఆ కోళ్లు వెన్నకి తగ్గవు. ప్రాణం పోయేవరకు పోటీ పడుతూనే ఉంటాయి.ఆ రెండు కోళ్ళల్లో ఓ కోడి నెలకొరిగేవరకు పందెం సాగిడుతూనే ఉంటుంది.
అయితే ఈ సారి మాత్రం సంక్రాంతి వచ్చింది తుమ్మెద సరదాలు తెచ్చింది తుమ్మెద అంటూ కోడిపందాలు వేస్తే తాటతీయ్యమంటోంది హైకోర్టు. సంక్రాంతికి కోడి పందాలు వేయడం అనేది ఆనవాయితీ అని ఎవరైనా కోడి పందాల జోలికి వెళ్తే శిక్షలు తప్పవంటోంది హైకోర్టు.ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు, జూదం, అక్రమ మద్యం విక్రయాన్ని అడ్డుకోవడం లో ఉన్నతాధికారులు విఫలం అవుతున్నారని పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు హై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కోడి పందాలకు అనుమతులు ఇవ్వొద్దని..గతంలో ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడాలని జిల్లా పోలీసు యంత్రాగానికి ,ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ఆదేశాలను ఉల్లఘించి ఎవరైనా సంప్రదాయం పేరుతో కోడికి కత్తి కట్టి కోడి పందాలు నిర్వహిస్తే జంతు హింస నేరం కింద చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించింది.