పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తాం: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Anjali |   ( Updated:2024-06-13 09:18:21.0  )
పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తాం: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అర్చకులు అందించారు. ముఖ్యమంత్రి అయినా, శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు, ఎప్పుడు తిరుమల వచ్చినా, సామాన్యుడిలా, క్యూలైన్ నుంచే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఈ సారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించడం గమనార్హం. ఇకపోతే సీఎం అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొని.. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. సంపద సృష్టించి పేదలకు అందేలా చూస్తామని అన్నారు. గత ఐదేళ్లలో ఏపీకి అపారనష్టం జరిగిందని అన్నారు. జరిగిన నష్టంలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు. విధ్వంసమైన అమరావతి, పోలవరంను సరి చేస్తామని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు కోరారు. పాలనా అంటే ఏంటో గతంలో చూపించా.. ముఠా నాయకులను ఏరివేశా.. రౌడీ అనే వాడిని లేకుండా చేశా.. నేరాలు చేసి నా నుంచి ఎవరు తప్పించుకోలేరని నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed