Navy Day : విశాఖలో 'నేవీ డే' విన్యాసాలు

by M.Rajitha |
Navy Day : విశాఖలో నేవీ డే విన్యాసాలు
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం(Vishakhapatnam)లో నేవీ డే(Navy Day) వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఏటా డిసెంబర్ 4న ఇండియన్ నేవీ డే విశాఖలో జరపుతుండగా.. ఈ ఏడాది మాత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సొంత రాష్ట్రమైన ఒడిశాలోని పూరీ తీరాన నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ముగింపు ఉత్సవాలను మాత్రం నేడు విశాఖ సాగర తీరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) హాజరయ్యారు. సాగర తీరాన ఆర్కే బీచ్​లో జరగుతున్న విన్యాసాలు చూపరులకు కనువిందు చేశాయి. శత్రువులపై దాడి చేసే సన్నివేశాలు తీరంలో యుద్ధ సన్నివేశాలు, సముద్రంలో చిక్కుకున్న సైనికులను కాపాడే విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచాయి. మరోవైపు గగన తలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సాగించిన విన్యాసాలు ప్రజలను అబ్బురపరచగా. మెరైన్ కమెండోల​ విన్యాసాలు వీక్షకులను కట్టిపడేశాయి.

Advertisement

Next Story