- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: ఘనంగా నేవీ డే.. ఆకట్టుకుంటున్న విన్యాసాలు
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో ఘనంగా నేవీ డే వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్బుల్ నజీర్ హాజరయ్యారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో గెలుపునకు ప్రతీకగా ప్రతి ఏడాది డిసెంబర్ 4న నేవీ డే వేడుకలను విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తారు. అయితే తుపాను కారణంగా డిసెంబర్ 4కు బదులు ఇవాళ (డిసెంబర్ 10న) అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో ప్రదర్శనలు జరుగుతున్నాయి.
దాదాపు 8 వేల అడుగుల ఎత్తు నుంచి పారా చూట్ సాయంతో జాతీయ జెండా, నేవీ జెండా ఎగురువేసి చూపరులను ఆకట్టుకున్నారు. మరోవైపు నేవీ యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్‌లు, జలాంతర్గాములు, హెలికాప్టర్‌లతో సిబ్బంది విన్యాసాలు చేస్తున్నారు. దాదాపు 2 వేల మంది నౌకాదళ సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. ఈ విన్యాసాలను ప్రజలు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు.
ఈ ప్రదర్శనల అనంతరం నేవీ హౌస్‌లో ‘ఎట్ హోమ్’ పేరుతో ఈస్టర్ర్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంఢార్కర్ ఆధర్యంలో ఏర్పాటు చేయనున్న టీ పార్టీకి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. అనంతరం తిరిగి ఆయన విజయవాడ రాజ్ భవన్‌కు చేరుకుంటారు.