ప్రజల కోసం ప్రాణాన్ని కూడా లెక్క చెయ్యని నాయకుడు ఆయన.. నారా లోకేష్

by Indraja |   ( Updated:2024-01-24 07:24:06.0  )
ప్రజల కోసం ప్రాణాన్ని కూడా లెక్క చెయ్యని నాయకుడు ఆయన.. నారా లోకేష్
X

దిశ వెబ్ డెస్క్: ఈ రోజు పరిటాల రవి వర్ధంతి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ X వేదికగా నివాళులర్పించారు. ఈ క్రమంలో పరిటాల రవి ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ ఓ పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ లో నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ప్రాణాన్ని కూడా లెక్కచేయకపోవడం అతి కొద్దీ మందికి మాత్రమే సాధ్యం. చివరి శ్వాస వరకు ప్రజల శ్రేయస్సు కోసం జీవించిన ప్రజా నాయకుడు స్వర్గీయ పరిటాల రవి గారి వర్ధంతి సందర్భంగా ఘానా నివాళి అని రాసుకొచ్చారు.

కాగా అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసన సభ సభ్యుడు అలానే తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడైన పరిటాల రవి 2005 లో హత్యకు గురై తుది శ్వాస విడిచారు. కాగా వీరి తండ్రి పరిటాల శ్రీరాములు కూడా బంజర భూములు పేదలకు పంచి పెట్టాలని పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో హత్యకు గురై మరణించారు. అయితే పరిటాల రవి అలానే ఆయన తండ్రి ఇరువురు కూడా హత్యకు గురై ప్రాణాలను పోగొట్టుకోవడం గమనార్హం. కాగా క్రేజీ డైరెక్టర్ RGV పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రక్త చరిత్ర పేరుతో రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలానే పరిటాల రవి తండ్రి శ్రీరాములు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు ఎన్. శంకర్ శ్రీరాములయ్య అనే చిత్రాన్ని తీశారు.

Advertisement

Next Story