- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP ముస్లిం మైనారిటీలకు Nara lokesh పూర్తి భరోసా
దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనారిటీలపై దాడులు తీవ్రం అయ్యాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. మైనారిటీల నిధులు మళ్లించారు.. సంక్షేమపథకాలు ఆపేశారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ నివాసంలో శనివారం ముస్లిం మైనారిటీ ప్రముఖులు, టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో ముస్లిం సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని.. నంద్యాలలో ఓ కుటుంబం బలవన్మరణం, నరసరావుపేటలో మసీదు ఆస్తుల పరిరక్షణకి పోరాడిన టీడీపీ నేతను హత్య చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణలేదని స్పష్టమైందన్నారు. ముస్లింల సంక్షేమానికి గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలన్నీ ఆపేశారని, అరకొర పథకాలున్నా పొందేందుకు వీలులేని అడ్డగోలు నిబంధనలు విధించారని వాపోయారు. వైసీపీ పాలనలో ఆర్థికంగానూ, సామాజికంగానూ మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందని లోకేశ్‌కి వివరించారు. మైనార్టీల రక్షణ, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. మైనారిటీల పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, మైనారిటీల భద్రత కల్పిస్తామని, సంక్షేమానికి కృషి చేస్తామని, వైసీపీ మైనారిటీలకు చేసిన అన్యాయాన్ని సరిదిద్దుతామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.
- Tags
- Naralokesh