Nara Lokesh: బాబాయిని చంపిన సైకో జగన్

by srinivas |
Nara Lokesh: బాబాయిని చంపిన సైకో జగన్
X

దిశ, తిరుపతి: బాబాయిని చంపిన సైకో జగన్ అని...ఆయన జిల్లాకో సైకోను తయారు చేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఒక సైకో...జైలుకు వెళ్లిన సైకోకు పాలనపై ఏమి అవగాహన ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రతో వైఎస్సార్సీపీ అంతిమ యాత్ర మొదలైందన్నారు. 18వ రోజు నగరి నియోజకవర్గం చినరాజకుప్పలో లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. చినరాజకుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన లోకేశ్‍.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలనపై మండిపడ్డారు. యువగళం పాదయాత్రను అడ్డుకోవటానికి వెయ్యిమంది పోలీసులను మోహరించారని.. జగన్ రెడ్డి మూడున్నరేళ్లలో తన మైకును తొలగించడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు.

పదో తరగతి తప్పిన జగన్‌కు ఇంత తెలివితేటలుంటే...

పదో తరగతి తప్పిన జగన్‌కు ఇంత తెలివితేటలుంటే.. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివిన తనకెంత తెలివి ఉండాలన్నారు. లక్ష కోట్ల రూపాయలు దోచేసి జైలుకు వెళ్లిన జగన్ పాదయాత్ర చేస్తే.. అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు సృష్టించలేదని గుర్తుచేశారు. తాను పాదయాత్ర చేస్తే ఇన్ని ఆంక్షలా అని ప్రశ్నించారు. తన పాదయాత్రను ఆడ్డుకోవడంపై చూపిన శ్రద్ధ.. పోలీసులు సంక్షేమంపై పెట్టాలని హితవు పలికారు. జగన్‍ పాలనలో కానిస్టేబుల్‌కు రూ.75 వేలు, ఎస్ఐకి రూ.90 వేలు, సీఐకి లక్ష రూపాయలు బకాయి పెట్టారని ఆరోపించారు. పోలీసులు, ఉపాధ్యాయ నియామకాలు లేకుండా జగన్‍ చేశారని ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రానిది మూడోస్థానం.. బాబాయిని చంపిన కేసులో భారతిరెడ్డి పీఏను సీబీఐ విచారించిందని తెలిపారు. కేసుల నుంచి బయటపడటానికి ప్రత్యేక హోదాను అడగటం లేదన్నారు. కంత్రీ జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందన్నారు. టీడీపీ హయాంలో ఉద్యోగులకు పీఆర్సీతో పాటు జీతాలు సకాలంలో వచ్చాయని.. కంత్రీ జగన్ పాలనలో జీతాల కోసం దేవుడిని చూడాల్సి వస్తోందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed