Breaking: ప్రజల జీవితాలు నాశనం కావడానికి కారణం ఆయనే.. నారా లోకేష్

by Indraja |
Breaking: ప్రజల జీవితాలు నాశనం కావడానికి కారణం ఆయనే.. నారా లోకేష్
X

దిశ డైనయిక్ బ్యూరో: ఈ రోజు విశాఖపట్నంలో నిర్వహించిన శంఖారావం సభలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నాన్ని సిటీ అఫ్ డెస్టినీ.. అలానే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని అని అంటరాని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖను జాబ్ కాపిటల్ అఫ్ ఇండియాగా చేస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక గంజాయి కాపిటల్ అఫ్ ఇండియాగా మార్చిందని తెలిపారు.

ఇక ఈ గంజాయి వెనుక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారని ఆరోపించారు. అనంతబాబు తూర్పు గోదావరి జిల్లాలో గంజాయి ప్రోత్సహించి ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా గంజాయి డిస్ట్రిబ్యూషన్ సెట్ చేసి జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తాను యువగలం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో నడిచినప్పుడు ఓ తల్లి వచ్చి తనని కలిసిందని.. అయితే ఆమె లోకేష్ బాబుతో మాట్లాడాలి మీడియా మిత్రులు ఎవరు ఉండకూడదని కోరిందని.. తన కోరిక ప్రకారమే తనతో ఒంటరిగా మాట్లాడానని తెలిపారు.

అప్పుడు ఆమె తనకు ముగ్గురు కూతుర్లు అని.. అయితే వాళ్లలో పెద్ద అమ్మాయి పదోతరగతి చదువుతోందని.. ఆ అమ్మాయిని గంజాయికి బానిసను చేసి వైసీపీ నాయకులు శారీరకంగా వాడుకున్నారని.. ఆ అమ్మాయికి వైద్యం చేయించి మామూలు మనిషిగా మార్చేందుకు ఆమె దగ్గర డబ్బులు లేవని.. ఓ అన్నగా ఆదుకోవాల్సిందిగా తనని అడిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

లక్షల కుటుంబాలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మత్తులో తన దళిత డ్రైవర్ సుబ్రమణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపి, శవాన్ని డోర్ డెలివరీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయాన్ని తాను చంద్రబాబుతో మాట్లాడినప్పుడు.. మన ప్ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుల్లో ఉన్న రాష్టాన్ని దారిలో పెట్టడం.. ప్రజల కష్టాలను తీర్చడం ఎలాగో తెలుసని.. కానీ గంజాయి మత్తులో ఉన్న తరాన్ని ఎలా బయటకు తీసుకురావాలో అర్ధం అవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.

ఇక టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ గంజాయిపై పెద్ద ఎత్తున యుద్ధం చెయ్యాలని.. అలానే ఈ గంజాయి వెనుక ఉన్న వ్యక్తిని తరిమితరిమి కొట్టాలని.. వాళ్ళని జైలుకు పంపించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed