- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:ప్రజల మనసులు నేడు తేలికపడ్డాయి..నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో టీడీపీ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నిజం గెలవాలి’ పర్యటనలో ప్రజల బాధలు చూశానని, నేడు కూటమి విజయంతో రాష్ట్రంలో ప్రజలు తామే గెలిచామన్న సంతోషాన్ని చూశానని నారా భువనేశ్వరి అన్నారు.
వైసీపీ పాలనలో అశాంతితో బతికిన ప్రజల మనసులు నేడు తేలిక పడ్డాయని ట్విట్టర్ వేదికగా నారా భువనేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే వస్తాయన్నారు. కౌరవ సభ స్థానంలో గౌరవ సభ కొలువవుతోందని తెలిపారు. గౌరవ సభతో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో అమరావతి రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుంది అన్నారు. రాజధాని రైతుల పోరాటాలు ఫలించి వారి జీవితాల్లో చీకట్లు తొలగి పోయాయని చెప్పారు. చంద్రబాబు దీక్ష పట్టుదలతో జీవనాడి పోలవరం ప్రాజెక్టు సవాళ్లను, విధ్వంసాన్ని అధిగమించి ముందడుగు వేస్తుందని తెలిపారు.