- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రకృతి విపత్తులను ఆపడం మన చేతుల్లో ఉండదు’.. నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రకృతి విపత్తులను ఆపడం మన చేతుల్లో ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. కాకపోతే అలాంటి సమయంలో వేగంగా స్పందించి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యలను అందించాలని, దీంతో ఆస్తి ప్రాణ నష్టాలను తగ్గించుకోవచ్చని వెల్లడించారు. బాధితులకు భరోసా కల్పించవచ్చని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అదే చేస్తోందని, ముఖ్యమంత్రి అయ్యుండి చంద్రబాబు స్వయంగా బాధితుల దగ్గరకు వెళ్లారని తెలిపారు. వారికి ఆహారం, నీరు అందించి ధైర్యం చెబుతున్నారని పేర్కొన్నారు. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయన్నారు. అన్ని కార్యక్రమాల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా తన వంతు సాయంగా రంగంలోకి దిగుతోందని నారా భువనేశ్వరి చెప్పుకొచ్చారు. ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిబ్బందికి ఆదేశాలిచ్చానని వెల్లడించారు. అలాగే వాలంటీర్స్ తమ వంతు సహాయం చేయాలని కోరుతున్నానని అన్నారు.