Nandigam Suresh: 2 రోజుల పోలీస్ కస్టడీకి నందిగం సురేష్

by M.Rajitha |
Nandigam Suresh: 2 రోజుల పోలీస్ కస్టడీకి నందిగం సురేష్
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీకి చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు 2 రోజుల పోలీస్ కస్టడీ విధిస్తూ మంగళగిరి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. 2021లో మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి కేసులో కీలక నిందితుడుగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు ఈ నెల 5న హైదరాబాద్ లో అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో ప్రవేశ పెట్టగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా నందిగం సురేష్ ను విచారించేందుకు 8 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం విచారించిన కోర్ట్.. ఇరువైపులా వాదనల అనంతరం తీర్పును నేటికి వాయిదా వేసింది. నేడు సురేష్ ను 2 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్ట్ తీర్పు జారీ చేసింది. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ ను ఈనెల 15 నుండి 17 వరకు జైళ్లోనే పోలీసులు విచారించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed