- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
చంద్రబాబుకు మద్దతుగా నందమూరి సుహాసిని నిరాహార దీక్ష
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ అక్టోబర్ 2న శాంతి యుతంగా నిరాహార దీక్ష చేయాలని నందమూరి సుహాసిని నిర్ణయించుకున్నారు. గాంధీ జయంతి రోజున తన అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ నారా చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. అలాగే ఆయనకు మద్దతుగా నారా భువనేశ్వరీ, నారా లోకేశ్‌లు సైతం చేయబోతున్నారు. వీరికి సంఘీభావంగా అక్టోబర్ 2న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు నందమూరి సుహాసిని ప్రకటించారు. ‘వీ ఆర్ విత్ సీబీఎన్’ అంటూ నిరసనకు దిగనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు అనుచరులు, ఐటీ ఉద్యోగులు, మద్ధతుదారులు పాల్గొనాలని నందమూరి సుహాసిని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్టాడుతూ రాజకీయ కక్షలో భాగంగానే చంద్రబాబు నాయుడును అకారణంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.23 రోజులుగా చట్టవిరుద్ధంగా చంద్రబాబును నిర్బంధించారని ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి సంఘీభావం ప్రకటించాలని నందమూరి సుహాసిని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.