AP Politics:అధికారంలోకి కూటమి రావడం ఖాయం..తేల్చి చెప్పిన నాగబాబు

by Jakkula Mamatha |   ( Updated:2024-05-24 12:19:56.0  )
AP Politics:అధికారంలోకి కూటమి రావడం ఖాయం..తేల్చి చెప్పిన నాగబాబు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ ప్రక్రియ మే 13వ తేదీన ముగిసింది. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. కాగా జూన్ 4వ తేదీన కూటమి ఘన విజయం సాధిస్తుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేత నాగబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలవబోతున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. మంగళవారం పార్టీ నేతలతో వర్చువల్ సమావేశంలో నాగబాబు పాల్గొని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వ్యూహం, చంద్రబాబు అనుభవం, బీజేపీ మద్దతు ఫలించాయని తెలిపారు. జూన్ 4వ తేదీ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా మనందరి ఆలోచన ఉండాలి. ‘పవన్ కళ్యాణ్ పూనుకోకపోతే రాష్ట్రం మళ్లీ భూబకాసురులు దోపిడీకి బలైపోయే పరిస్థితి వచ్చేది’ అని అన్నారు.

Click Here For Twitter Post..

Advertisement

Next Story

Most Viewed