AP Politics: అరే.. నేను లోకల్ రా బై..గెలిచేది నేనే.. ఆయనకంత సీన్ లేదు

by Indraja |
AP Politics: అరే.. నేను లోకల్ రా బై..గెలిచేది నేనే.. ఆయనకంత సీన్ లేదు
X

దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓ వైపు పార్టీల ప్రచారాలు మరో వైపు అభ్యర్థుల ప్రకటన.. ఇంకో వైపు పొత్తుల కత్తులతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికీ వారు గెలుస్తామనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని పార్టీలు, అభ్యర్థులను ప్రకటించాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులని ప్రకటించాల్సి ఉన్నపటికీ.. ప్రస్తుతం చాలావరకు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో ఎవరికీ ఎవరు పోటీ అనే అంశం పై దాదాపు స్పష్టత వచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా మురుగుడు లావణ్య మీడియాతో మాట్లాడారు. కాగా రానున్న ఎన్నికల్లో ఈమె మంగళగిరి నియోజకవర్గం నుండి వైసీపి తరుపున పోటీ చేయనున్నారు. అయితే ఆమెకు పోటీగా టీడీపీ నుండి నారా లోకేష్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేశారు.

ప్రత్యర్థి ఎవరు అనేది తనకి అనవసరమని.. ప్రత్యర్థి గురించి అసలు ఆలోచించనని పేర్కొన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇక తాను చేస్తున్న ఎన్నికల ప్రచారంలో తనకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని వెల్లడించారు. ఇక ముఖ్యంగా తాను లోకల్ అని తన ప్రత్యర్థి నారా లోకేష్ నాన్ లోకల్ అని.. కనుక కచ్చితంగా గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేశారు.

ఇక తనకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పూర్తిస్థాయిలో మద్దతుగా ఉన్నారని.. అలానే తన ఫ్యామిలీ కూడా తనకి అండగా ఉందని కనుక కచ్చితంగా గెలుపుతనదే అని పేర్కొన్నారు.

Read More..

యువతుల ఉన్నత విద్యకు టీడీపీ-జనసేన ఆర్థిక భరోసా:యరపతినేని

Advertisement

Next Story