- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడును కుటుంబ సభ్యులు ములాఖత్ ద్వారా కలిశారు. మంగళవారం ఉదయం రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు కలిశారు. వీరితోపాటు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సైతం కలిశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
ధైర్యంగానే ఉన్న చంద్రబాబు: చినరాజప్ప
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అనంతరం మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. జనసేనతో టీడీపీ పొత్తుపై ముందుకెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలిపారు. రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని సూచించినట్లు మీడియాకు వెల్లడించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ఆరోగ్యంగానే ఉన్నారని.. మానసికంగా దృఢంగా ఉన్నారని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ధైర్యంగా ఉండాలని చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. చేయని తప్పుకు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పటికీ నిత్యం రాష్ట్రం కోసమే పరితపిస్తున్నారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై పోరాటం ఆపొద్దని.. ధైర్యంగా పోరాడాలని చంద్రబాబు నాయుడు తమకు తెలియజేశారని మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.