పేరు మార్చండి మహాప్రభో.. ముద్రగడ రిక్వెస్ట్

by Rajesh |   ( Updated:2024-06-05 04:50:19.0  )
పేరు మార్చండి మహాప్రభో.. ముద్రగడ రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఘన విజయం తర్వాత తొలిసారి కాపునేత ముద్రగడ స్పందించారు. ఏపీలో గెలుపొందిన కూటమికి ముద్రగడ శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాలను ఏపీలో ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్‌ను ఓడిస్తానని సవాల్ చేశానని.. తాను ఓటమి చెందనన్నారు. అన్నమాట ప్రకారం తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చాలని కోరుతూ.. గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా రెడీ చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

పిఠాపురంలో పవన్ గెలుపుతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మీడియా ఎదుట ఈ మేరకు దరఖాస్తు ఫామ్ చూయించారు. త్వరలో తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని తెలిపారు. పవన్‌ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయన ఎన్నికల ముందు శపథం చేసిన విషయం తెలిసిందే. కాగా ఏపీలో ముద్రగడ పద్మానాభం పేరు మార్పు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story