- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉండి సీటు నాకే అని చంద్రబాబు చెప్పలేదు.. రాఘురామరాజు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన అదే జిల్లా ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వర్గీయులు ఉండిలో పార్టీ అధిష్టానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉండి సీటు తనకే అని గానీ, రామరాజుకు సీటు లేదని గాని చంద్రబాబు చెప్పలేదని తెలిపారు. అయితే తాను మాత్రం కచ్చితంగా పోటీ చేస్తానని వెల్లడించారు. తాను టీడీపీలో చేరేటప్పుడు కండీషన్లు పెట్టలేదన్నారు. అధినేత ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు కట్టుబడి ఉంటానని రఘురామరాజు స్పష్టం చేశారు. పార్టీ ఎక్కి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలో దిగుతానన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థినా అనేది మాత్రం చంద్రబాబు నిర్ణయిస్తారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.