- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతిగా మాట్లాడితే ఇంటికొచ్చి కొడుతా.. MLC స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ రాజకీయాలు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తో్న్న వేళ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలోనే ఎంపీ ఎంవీవీపై ఎమ్మె్ల్సీ వంశీకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు ఆరోపణలు, అనవసర విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతానని ఎంవీవీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా.. ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఎంవీవీ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై విశాఖ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, ఇటీవల జనసేన పార్టీలో చేరిన వంశీకృష్ణ ఎంపీ ఎంవీవీపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలని ఉందని.. అందుకే తాను వైసీపీ నుంచి జనసేనలో చేరానని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వెల్లడించారు. తాను రాజకీయాల కోసం 60 ఎకరాల భూమి, 10 సైట్లు అమ్ముకున్నానని.. తన రాజకీయ భవిష్యత్ నాశనం కావడానికి వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కారణమని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఓడించడమే తన లక్ష్యమని వంశీకృష్ణ యాదవ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.