చంద్రబాబు పంచింది అన్ని వేల కోట్లా..? .. పింఛన్లపై అసలు విషయం చెప్పిన పేర్ని నాని

by srinivas |   ( Updated:2024-04-03 10:41:04.0  )
చంద్రబాబు పంచింది అన్ని వేల కోట్లా..? .. పింఛన్లపై అసలు విషయం చెప్పిన పేర్ని నాని
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పింఛన్ పాలిటిక్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. పింఛన్‌దారులకు వార్డు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దని సీఈసీ ఆంక్షలు విధించడంతో అధికార, ప్రతినేత మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. వృద్ధులు, వితంతువు, వికలాంగులకు పింఛన్లు ఆలస్యానికి టీడీపీ నేతలే కారణమంటూ వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, టీడీపీ నేతలపై పేర్ని నాని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో టీడీపీ పథకాలను తాము ఆపలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హాయాంలో పింఛన్ల రూపంలో చంద్రబాబు రూ. 43 వేల కోట్లు పంచారని గుర్తు చేశారు. కానీ అప్పుడు టీడీపీకి ఓటు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. పసుపు, కుంకుమ పేరుతో ప్రేమ ఉన్నట్లు నటించినా ప్రజలు టీడీపీకి ఓట్లు వేయలేదని ఎద్దేవా చేశారు. పింఛన్లు ఆపలన్న ఆలోచన అసలు ఎవరికి వస్తుందన్నారు. కానీ చంద్రబాబుకు మాత్రం వృద్ధుల ఉసురుతగులుతుందని పేర్ని నాని శపించారు. వాలంటీర్లు ఇంటికెళ్లి పింఛన్ నగదు అందజేస్తే మాకు ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. మరి అన్నేళ్లు అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు 1వ తారీకునే ఇంటికి వెళ్లి పింఛన్ అందించలేదని నిలదీశారు. రెండు నెలలు పింఛన్లు ఆపినంత మాత్రానా జగన్‌పై ప్రజలకు ఉన్న ప్రేమ తగ్గుతుందా అని పేర్ని నాని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థ చంద్రబాబు విషం చిమ్మారని.. దుర్మార్గమైన ఆలోచన చేసిన వారిని ప్రజలు ఓడిస్తారని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story