- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీపై కొడాలి నాని సెటైర్స్
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రశాంత్ కిషోర్‌ను తాము వాడేశామని, ఆయన బుర్రలో ఉన్న గుజ్జంతా అయిపోయిందని సెటైర్లు వేశారు. తమకు సలహాదారుడిగా ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ పై చంద్రబాబు విమర్శలు చేశారని గుర్తు చేశారు. ప్రశాంత్ కిషోర్ సూచనలతోనే బాబాయ్‌ను చంపి, జగన్ కోడి కత్తి డ్రామాలు ఆడారని చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా గగ్గోలు పెట్టాయని మండిపడ్డారు. మరి ఇప్పుడు తండ్రి చంద్రబాబు పీక కోయడానికి నారా లోకేశ్ ప్లాన్ చేస్తున్నారా అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ రాజకీయ నేత అని, ఎంత మంది పీకేలను తీసుకొచ్చినా రాష్ట్రంలో సీఎం జగన్‌ను ఏమీ చేయలేరన్నారు. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ కలిస్తే భూమి బద్దలవుతుందా అని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్‌కు ఐప్యాక్‌కు సంబంధం లేదని కొడాలి స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో చేరమని బెంగాల్ ముఖ్యమంత్రి బెనర్జీ పంపితే చంద్రబాబు వద్దకు ప్రశాంత్ కిషోర్ వెళ్లారని కొడాలి నాని తెలిపారు.