Meerut Murder: డ్రగ్స్ కు బానిసలుగా.. తిండి లేకుండా.. మీరట్ మర్డర్ కేసులో నిందితుల తీరిదే

by Shamantha N |
Meerut Murder: డ్రగ్స్ కు బానిసలుగా.. తిండి లేకుండా.. మీరట్ మర్డర్ కేసులో నిందితుల తీరిదే
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మీరట్ మర్డర్ కేసులో నిందితుల గురించి రోజుకో విషయం బయటకొస్తుంది. మర్చంట్ నేవీ అధికారి హత్య (Merchant navy officer) హత్య కేసులో అరెస్టయిన ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ కు సంబంధించిన పలు విషయాలను పోలీసులు బయటపెట్టారు. వారిద్దరూ డ్రగ్స్ కు బానిసలుగా మారారని చెప్పుకొచ్చారు. జైలులో తిండి లేకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అరెస్టయినప్పట్నుంచి అవి దొరక్కపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. గంజాయి కావాలని పట్టుబడుతున్నట్లు వెల్లడించారు. కాగా.. సాహిల్ ఆరోగ్యం క్షీణించిందని అధికారులు తెలిపారు. హాస్పిటల్ తరలిస్తే నానా హంగామా చేశాడని చెప్పారు. వారిద్దరి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అందుకే తోటి ఖైదీలపై దాడులు చేసే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే వేరేగా ఉంచినట్లు తెలిపారు. మర్డర్ సమయంలోనూ సాహిల్ డ్రగ్స్ మత్తులోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జైలులోనే డీ అడిక్షన్ సెంటర్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు వెల్లడించారు.

మీరట్ లో దారుణ హత్య

నిందితురాలు ముస్కాన్ 2016లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ పూత్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరికీ 2019లో కుమార్తె పుట్టింది. ఆ తర్వాత సాహిల్ తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో విడాకుల వరుకు వెళ్లిన సౌరభ్.. కుమార్తె కోసం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన అతడు కుమార్తె పుట్టిన రోజు కోసం తిరొచ్చాడు. దీంతో, అతడ్ని మార్చి 4న చివరకు తమ ప్రణాళిక ప్రకారం ముస్కాన్.. ఆమె ప్రియుడు సాహిల్.. సౌరబ్‌ను చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్ పోసేశారన్నారు.

Next Story