భరత్ ప్రచార రథం దగ్ధం కేసులో సొంత అనుచరుడి అరెస్ట్.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్ట్రాంగ్ కౌంటర్

by srinivas |
భరత్ ప్రచార రథం దగ్ధం కేసులో  సొంత అనుచరుడి అరెస్ట్.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి మాజీ మాజీ ఎంపీ, వైసీపీ నేత భరత్‌పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సెటైర్లు వేశారు. భరత్ చేసిన సవాల్‌కు ఆయన రియాక్ట్ అయ్యారు. భరత్ మంచి నటుడంటూ ఎద్దేవా చేశారు. నటిస్తే పర్వాలేదని, జీవిస్తేనే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. భరత్ ఒట్టేస్తే శివయ్య కూడా పారిపోతాడేమోనని ఎద్దేవా చేశారు. భరత్‌కు పబ్లిసిటీ పచ్చి పట్టుకుందని, అందులో దేవుడిని కూడా లాగుతున్నారని మండిపడ్డారు.భరత్ ప్రచార రథాన్ని తగలబెట్టింది ఆయన అనుచరుడేనని ఆదిరెడ్డి వాసు ఆరోపించారు. ఐదేళ్లుగా తనపై అక్రమంగా కేసులు పెట్టినా.. ప్రయాణం చేయమని ఎప్పుడూ అడగలేదని ఆదిరెడ్డి వాసు చెప్పారు. తాను ప్రజలను నమ్ముతానని, తాను ఎలాంటి వాడిననే వాళ్లే నిర్ణయిస్తారన్నారు. రాజకీయాల కోసం భరత్ నాటకాలాడుతున్నారని, ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు.

కాగా ఎన్నికల సమయంలో భరత్ ప్రచార రథాన్ని కొందరు దుండగులు దగ్ధం చేశారు. అయితే టీడీపీ శ్రేణులేనని తన ప్రచార రథాన్ని తగలబెట్టారని భరత్ ఆరోపించారు. అయితే తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. భరత్ అనుచరుడు, వైసీపీ కార్యకర్త శివాజీని అరెస్ట్ చేశారు. దీంతో భరత్ స్పందించారు. శివాజీ గతంలో టీడీపీ సోషల్ మీడియాలో పని చేశారని తెలిపారు. శివాజీ బంధువులంతా టీడీపీలో ఉన్నారని చెప్పారు. శివాజీని తన వద్దకు పంపి టీడీపీ నాయకులు కోవర్టు ఆపరేషన్ చేశారని వ్యాఖ్యానించారు. దీనిపై మార్కండేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని భరత్ సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై స్పందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ భరత్ పై విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed