- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి రోజాకు టికెట్ ఇవ్వరు.. ఇచ్చినా గెలవదు: బీజేపీ నేత భాను ప్రకాశ్‌రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కళ్ళల్లో ఆనందం చూసేందుకు ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా విమర్శలకు టార్గెట్ చేస్తున్నారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. విజయసాయి రెడ్డి, మంత్రి ఆర్‌కే రోజాలు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం అన్యాయమన్నారు. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి, మంత్రి ఆర్‌కేరోజాలు దగ్గుబాటి పురంధేశ్వరికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తున్న పురంధేశ్వరి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిపోయి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం దారుణమన్నారు. పురంధేశ్వరి అడిగిన ప్రశ్నలకు జగన్, ఆ పార్టీ నేతల వెన్నులో వణుకు పుడుతోందని చెప్పుకొచ్చారు. భయంతో బ్యాలెన్స్ తప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని భానుప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్‌కే రోజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో మంత్రి రోజా అనేక అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు మంత్రి రోజా వెనకేసుకున్నారని అన్నారు. రోజా ఎక్కడకెక్క ఎన్ని కోట్లు సంపాదించి ఎక్కడెక్కడ దాచుకున్నారనే డేటా మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద, బీజేపీ వద్ద ఉందని భాను ప్రకాశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో మంత్రి ఆర్‌కే రోజాకు టికెట్ ఇచ్చే ప్రసక్తేలేదని అన్నారు. ఒకవేళ మంత్రి ఆర్‌కే రోజాకు టికెట్ ఇచ్చినా గెలిచే సీన్ లేదని విమర్శించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలవ్వడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం రాబోతుందని ఆ ప్రభుత్వం వైసీపీ అవినీతిని కక్కిస్తుందని చెప్పుకొచ్చారు. దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లతో గెలవాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.